మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వంభర. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార మూవీ ఫేమ్ వశిష్ట ఈ భారీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇటీవలే ఈ మూవీ టైటిల్ మరియు కాన్సెప్ట్ గురించి రివీల్ చేస్తూ విడుదల చేసిన వీడియోకి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే విజువల్స్ తో ఫాంటసీ డ్రామా గా వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. కాన్సెప్ట్ వీడియో లో చూపించిన విజువల్స్ ఒక్కసారిగా సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది.. ఈ చిత్రం లో ముల్లోకాలు తిరిగే వీరుడిగా చిరంజీవి క్యారెక్టర్ ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..ఎక్కవ శాతం విజువల్ ఎఫెక్ట్స్ సాగె చిత్రం కావడం తో ఎక్కువభాగం సెట్స్ లోనే షూటింగ్ జరగనుందని సమాచారం.
తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం కోసం దాదాపు 7 ఎకరాల్లో 13 భారీ సెట్స్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యం లో సెట్స్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన సెట్స్ లో ఫిబ్రవరి మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.విశ్వాంతరాళం లో జరిగే కథ కాబట్టి ఆ స్థాయిలో భారీ సెట్లు అవసరం అవనున్నట్లు తెలుస్తుంది.కాన్సెప్ట్ వీడియో చూస్తుంటే..ఏదో ఒక లోకం నుంచి విసిరివేయబడ్డ పెట్టె చుట్టూ కథ తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి,అంజి వంటి ఫాంటసీ చిత్రాల తర్వాత ఆ జోనర్ లో మెగాస్టార్ నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.అంతే కాకుండా చాలా కాలం తర్వాత చిరంజీవి సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి.దీనితో ‘విశ్వంభర’ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.