Vishwambhara : టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’. తొలిచిత్రం బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మల్లిడి వశిష్ఠ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యువీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ త్రిష, ఆషిక రంగనాధ్ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు దర్శకుడు వశిష్ఠ. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని గతంలో ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు.
Read Also:KTR Tweet: రుణమాఫీ కాలేదని వ్యవసాయ మంత్రే చెప్పారు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
ఎన్నో అంచనాలు నెలకొన్న చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం సినిమాలో రెండు పాటలు షూటింగ్ మినహా అంతా పూర్తి అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరి బరిలోనే సినిమాని దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
Read Also:Silver Fish Drink: ఈ డ్రింక్ ధర 5 వేల రూపాయలా? అంతగా ఏముంది అందులో..