ఏపీలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం.. అవన్నీ విజయవంతమవుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి మంత్రులను చేసి ఇష్టానుసారంగా మాట్లాడమని ఊరు మీద వదిలి పెట్టినట్టుంది…ప్రజాస్వామ్యంలో వారి భాష చాలా అసభ్యకరమైనదిగా వుంది. వీధి రౌడీలుగా వ్యవహరిస్తున్నారు…ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర మాటల చాలా విడ్డూరంగా ఉంది…మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తామనడం సిగ్గు చేటు…మరో మంత్రి సీదిర అప్పలరాజు అవసరమైతే ఓటర్ల కాళ్ళు పట్టుకుంటాం..
మంత్రులు మానసికమైన రోగులుగా మారుపోతున్నారు…వీరి కోసం మానసిక ఆసుపత్రిలను విస్తరించాలి..అమరావతి రైతుల పాదయాత్రను తలుచుకుంటే ఆపేస్తామంటారు మంత్రి బొత్స..అంబటి రాంబాబు, రోజాలు ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. రాజకీయ నాయకుల వాడుతున్న భాష చూసి వారి ఉపన్యాసాలు వినడానికి ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు.. లోన్ యాప్ లపై ఇప్పటి వరకు వందమందికిపైగా చనిపోతున్నారు.. దీనిపై చర్చజరగాలి.. ప్రత్యేక శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేసి లోన్ యాప్ పై చర్చించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి. దేవాలయాలలో దర్శనాలకోసం ప్రత్యేక టిక్కెట్లు దందా చేసుకుంటున్నారు… కానీ భక్తులకు సరైన ఏర్పాట్లు చెయ్యడం లేదు.
Read Also: Puducherry: పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం.. బీజేపీ, ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమిలో చిచ్చు
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు వాళ్ల వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు.. ప్రభుత్వం విద్యార్థుల ఫీజులు కట్టక పోవడంతో చాలా మంది కోర్సు పూర్తి చేసి రోడ్డున పడుతున్నారు.. ఇప్పుడు యూనివర్సిటీల పేర్లు మార్పు చేస్తున్నారు.. ఇంకా మిగిలినవి టాయిలెట్కే వాటీ కూడా మీ పేర్లు పెట్టుకోండి.. 2014 నుంచి ఈ పేర్లు మార్పు సంస్కృతి వచ్చింది.. బ్రతికున్న వారి పేర్లు పెట్టడం ఇక్కడే చూశాం… ఇందిరా సాగర్ పోలవరం పేరు మార్చి పోలవరం అని పెట్టారు చంద్రబాబు.. ఈయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సాఆర్ పేరు పెడతామన్నారు.. కానీ మహనీయుడు ఎన్టీఆర్ పేరు కొనసాగేలా సూచన చేస్తున్నాం.. 370 పథకాలు ఎనిమిదేళ్ళలో మోడీ తీసుకు వచ్చారు… కానీ ఒక్క పథకానికైనా ఆయన పేరు పెట్టారా? అన్నారు విష్ణువర్థన్ రెడ్డి.
Godfather: క్లైమాక్స్ లో 14 నిమిషాల యాక్షన్ సీన్ అదుర్స్!