Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహ్మద్ సిరాజ్..హైదరాబాద్ గల్లీ క్రికెట్ ఆడిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. బుమ్రా గాయంతో జట్టుకు దూరమవగా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. టీమ్‌లో నమ్మదగిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సిరాజ్.. ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. వన్డే బౌలర్ల విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఔరా అనిపించాడు.
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొమ్మిది వికెట్లు సాధించిన సిరాజ్..న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో ప్రస్తుతం 729 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 727 పాయింట్లతో రెండో ప్లేస్‌కు పడిపోయాడు. మంగళవారం న్యూజిలాండ్‌ను మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక తాజా ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడు ఏకంగా 360 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ కు చేరుకున్నాడు. మరోవైపు కివీస్ సిరీస్‌లో పెద్దగా రాణించని విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి పడిపోయాడు. చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్ అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్‌లో కొనసాగుతున్నాడు..
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
🚨 There's a new World No.1 in town 🚨
India's pace sensation has climbed the summit of the @MRFWorldwide ICC Men's ODI Bowler Rankings 🔥
More 👇
— ICC (@ICC) January 25, 2023
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు