Vishnu Priya : జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఫేం విష్ణుప్రియ ఇంట్లో విషాదం నెలకొంది. తన కుటుంబం ప్రస్తుతం తీవ్రమైన బాధలో ఉందని.. తన కొండంత ధైర్యమైన తన తండ్రిని కోల్పోయినట్లు ఎమోషనల్ పోస్టును అభిమానులతో పంచుకున్నారు. మా నాన్నే నా సూపర్ హీరో అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది. ఏ పని చేసినా తన తండ్రి ఆశీర్వాదం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. జీవితంలో తన తండ్రి అందించిన ప్రోత్సాహాన్ని మరచిపోలేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన తండ్రిని ఎంతగా మిస్ అవుతున్నానో అంటూ చెప్పింది. వారం రోజులుగా కామెర్ల కారణంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తన తండ్రి చికిత్స చేయించుకున్నట్లు తెలిపింది. అయినా ఆరోగ్యం మెరుగుపడక పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారని బాధాతప్త హృదయంతో చెప్పింది. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాలని తన అభిమానులను విష్ణు ప్రియ కోరింది. ఈ క్రమంలోనే తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.