జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి)జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం,తల్లి అనారోగ్యం,తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు?…