Missing Plane Mystery: జాడలేని విమానం .. 22 రోజులుగా మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Plane Mystery: ఓ విమానం మిస్ అయ్యింది. నిజం అండి బాబు.. ఎవరికైనా చిన్నచిన్న వస్తువులు, వాహనాలు మిస్ కావడం తెలుసు. కానీ ఇక్కడ విచిత్రంగా ఓ విమానం మిస్ అయ్యింది. ఈనెల 2న ఆస్ట్రేలియా ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యం అయ్యింది. ఇప్పటికి 22 రోజులు గడిచాయి, కానీ దాని జాడ మాత్రం ఎక్కడ కనిపించలేదు. దానికి సంబంధించిన ఎటువంటి డిస్ట్రెస్ సిగ్నల్, రేడియో కాంటాక్ట్ లేదని అధికారులు చెప్తున్నారు. 72 ఏళ్ల గ్రెగొరీ వాఘన్, అతని 66 ఏళ్ల భాగస్వామి కిమ్ వార్నర్, వారి పెంపుడు శునకం మోలీ ప్రయాణిస్తున్న ఈ విమానం ఏమైందో తెలుసుకోడానికి అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
READ ALSO: Nellore : ఇళ్లు స్థలాలు ఇప్పిస్తానంటూ 21 కుటుంబాల నుంచి రూ.10వేల చొప్పున కాజేసిన లేడి డాన్ అరుణ
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
అసలు కథ ఏంటంటే..
టాస్మానియాలోని జార్జ్‌టౌన్ విమానాశ్రయం నుంచి ఆగస్టు 2 మధ్యాహ్నం 12:45 గంటల ప్రాంతంలో గ్రెగొరీ కిమ్‌ల విమానం షెడ్యూల్ చేసిన విమానాశ్రయానికి బయలుదేరింది. గ్రెగొరీ ఈ చిన్న విమానాన్ని నాలుగు నెలల క్రితమే కొనుగోలు చేశాడు. వాళ్ల విమానం చేరుకోవాల్సిన మొదటి గమ్యస్థానం విక్టోరియా. వాళ్లు ఇక్కడ కొద్దిసేపు ఆగిన తర్వాత, తిరిగి న్యూ సౌత్ వేల్స్‌లోని హిల్స్‌టన్ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. ఈ విమానం బాస్ స్ట్రెయిట్ సముద్రం మీదుగా గమ్యస్థానాన్ని చేరుకోడానికి బయలుదేరింది.
కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు సాయంత్రం ఐదు గంటల వరకు ఎటువంటి వార్త అందకపోవడంతో చిన్నగా అందరిలోనూ ఆందోళన మొదలైంది. వెంటనే కుటుంబసభ్యులు విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. స్పందించిన ఆస్ట్రేలియన్ మారిటైమ్ సేఫ్టీ అథారిటీ (AMSA) వెంటనే విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించింది. ఉత్తర టాస్మానియా, బాస్ స్ట్రెయిట్, దక్షిణ విక్టోరియా ప్రాంతాలలో పోలీసు పడవలు, హెలికాప్టర్లు, ఫెర్రీ విమానం కోసం వెతకడం ప్రారంభించాయి. కానీ వారికి ఇప్పటి వరకు విమానానికి సంబంధించిన ఎటువంటి జాడ దొరకలేదు.
జార్జ్‌టౌన్ విమాన శిక్షకుడు యూజీన్ రీడ్ ప్రకారం.. చిన్న విమానాలు తీరం నుంచి బయలుదేరే ముందు వైమానిక అధికారులకు తెలియజేయడం తప్పనిసరి. కానీ గ్రెగొరీ అలా చేయలేదు. జార్జ్‌టౌన్‌లో ప్రతి చిన్న విమానాన్ని అధికారులు పర్యవేక్షించరు. ఎవరైనా విమానాన్ని దాని హ్యాంగర్ నుంచి తీసివేసి ఎగిరితే, దానిని గుర్తించడం కష్టమవుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విమానం నుంచి ఎటువంటి అత్యవసర సిగ్నల్ రాలేదు.
టాస్మానియా పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిక్ క్లార్క్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. గ్రెగొరీ అనుభవజ్ఞుడైన పైలట్ అని అన్నారు. అతను స్థానిక ఫ్లయింగ్ క్లబ్‌లో ప్రముఖ సభ్యుడు, అలాగే ఆయనకు విమానాలను నడపడంలో చాలా కాలంగా అనుభవం ఉంది. కానీ ఆయన ప్రయాణించిన విమానం కొత్తది. ప్రమాదవశాత్తు దానిలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా, లేదా వారి విమానం అదృశ్యానికి మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉందని చెప్పాడు.
READ ALSO: Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?