Rice Pulling: విశాఖ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. ‘రైస్ పుల్లింగ్’ (Rice Pulling) పేరుతో కేటుగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ను బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా తనను నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె దఫదఫాలుగా ఆన్‌లైన్‌లో, నగదు రూపంలో పలుమార్లు డబ్బు చెల్లించినట్లు తెలిపింది. ముఠా సభ్యులు అరకు ప్రాంతానికి చెందిన ఏదో ఒక లోహాన్ని రైస్ పుల్లింగ్ పేరుతో అంటగట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా జేపీ మోర్గాన్ (JP Morgan) అనే కంపెనీతో పాటు పలు కంపెనీల పేరుతో ఈ ముఠా దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైస్ పుల్లింగ్ విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
Kurnool Bus Tragedy: 19 మంది సజీవదహనం.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన హోం మంత్రి
ఈ మోసం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన ఆ మహిళా వైద్యురాలు నెలన్నర రోజుల నుంచి విశాఖలోని ఓ హోటల్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని, ఈ రైస్ పుల్లింగ్ ముఠా నుండి రక్షించాలని ఆమె కోరుతుంది.