మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం పెద్ది కోసం శ్రీలంకకు బయల్దేరారు. ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సినిమా షూటింగ్ కోసం హీరో రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చి బాబు సానా శ్రీలంకకు బయల్దేరారు. సమాచారం ప్రకారం, రేపటి నుండే అక్కడ పెద్ది షూటింగ్ ప్రారంభం కానుంది.
Also Read :Prabhas-Spirit: ఆ విలనే కావాలి.. ఏంది మావా ఈ రచ్చ?
ఈ శ్రీలంక షెడ్యూల్‌లో, టీమ్ పెద్ది కొన్ని కీలకమైన సన్నివేశాలను, ఒక పాటను చిత్రీకరించనుంది. శ్రీలంకలోని అద్భుతమైన లొకేషన్లలో హీరో చరణ్, హీరోయిన్ జాన్వీ కాంబినేషన్లో ఈ పాటను షూట్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మ్యూజికల్ అప్‌డేట్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
Also Read :TheRajaSaab : రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ చెప్పిన విశ్వప్రసాద్
శ్రీలంకలో ఈ షూటింగ్ షెడ్యూల్ చురుకుగా పూర్తి చేసిన వెంటనే, ఈ సినిమా నుండి మొదటి సింగిల్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ మొదటి సింగిల్ పాటలో శ్రీలంకలో చిత్రీకరించిన అద్భుతమైన విజువల్స్‌ను జత చేయనున్నారు. దీంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.