Rice Pulling: విశాఖ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. ‘రైస్ పుల్లింగ్’ (Rice Pulling) పేరుతో కేటుగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్‌ను బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా తనను నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె దఫదఫాలుగా ఆన్‌లైన్‌లో, నగదు రూపంలో పలుమార్లు డబ్బు చెల్లించినట్లు తెలిపింది. ముఠా సభ్యులు అరకు ప్రాంతానికి చెందిన ఏదో ఒక లోహాన్ని రైస్ పుల్లింగ్ పేరుతో…