Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
- విరాట్ కోహ్లీపై చార్టర్డ్ ఫ్లైట్ రూమర్స్ వైరల్
- లండన్–బెంగళూరు ప్రయాణంపై తప్పుడు ప్రచారం
- కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఎమోజీలతో క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీంఇండియా సూపర్ స్టార్ బాట్స్మెన్ “విరాట్ కోహ్లీ” గురించి ఏ విషమైన సరే.. క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో ‘విరాట్ కోహ్లీ’ సంబంధించి మరోసారి ఓ పెద్ద రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో లండన్–బెంగళూరు మధ్య ప్రయాణానికి చార్టర్డ్ ఫ్లైట్స్ ఆర్సీబీ యాజమాన్యానికి హుకుం జారీ చేసినట్లు కొందరు లేనిపోని వార్తలను సృష్టించారు. అయితే తాజాగా ఈ వార్తలపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ఆ పుకారు వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెండు నవ్వుతున్న ఎమోజీలతో చాలా హుందాగా స్పందించాడు. వైరలైన సోషల్ మీడియా పోస్టుల్లో.. ఆర్సీబీ మ్యాచ్ ల మధ్య మూడు రోజుల గ్యాప్ ఉంటే యాజమాన్యాన్నీ చార్టర్డ్ విమానం ఏర్పాటు చేయాలని కోహ్లీ కోరాడని ప్రచారం జరిగింది. ఈ వాదనలన్నీ ఆధారంలేనివని కోహ్లీ రెండు ఎమోజిలతో తేల్చేసాడు. ఈ మధ్యనే లండన్ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన కోహ్లీ.. బెంగళూరులో జట్టు ట్రైనింగ్ క్యాంప్‌లో చేరాడు. ఎప్పటి లాగే మరోసారి ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించేందుకు కఠినంగా మైదానంలో శ్రమిస్తున్నాడు. మార్చి 28న ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ గా ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
కోహ్లీ లండన్ ప్రయాణాలపై చర్చలు కొత్తవి కావు. కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి లండన్ కు వెళ్తూ.. అక్కడ సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది విమర్శలు కూడా వ్యక్తం చేసేవారు లేకపోలేదు. దేశానికి చెందిన ప్రముఖ ఆటగాడు విదేశాల్లో ఎక్కువ సమయం గడపడం సరైనదేనా అనే పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎప్పుడునుండో వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..