అల్లు అర్జున్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా దేశ వ్యాప్తంగా అత్యధిక డబ్బులు వసూళ్లు చేసిందని అన్నారు. ఆయన సినిమా వల్ల ఓ మహిళ చనిపోతే 25 లక్షల రూపాయలు బిక్షం వేస్తున్నారా...? అని పేర్కొన్నారు. ఒక జీవితం ఖరీదు 25 లక్షలా..? ప్రశ్నించారు. అల్లు అర్జున్ కొడుకు చనిపోతే రూ.25 లక్షలు ఇస్తే ఊరుకుంటాడా..? అని అన్నారు.
ఓనం పండుగ సందర్భంగా అపార్ట్‌మెంట్ సముదాయంలో చిన్నారులు పూలతో పుష్పాలంకరణ చేశారు. అయితే ఒక మహిళ నలుగురు తిరిగే స్థలంలో ఇలాంటివి ఎందుకు ఏర్పాటు చేశారంటూ వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా ఓనం పండుగ స్వాగత అలంకరణను కాళ్లతో చెరిపేసింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు.
నిన్న (బుధవారం) రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఒకానొక సమయంలో ఆర్సీబీ గెలుస్తుందని అభిమానులు అనుకున్నప్పటికీ.. చివరికి రాజస్థాన్దే పై చేయి అయింది. సిరాజ్ వేసిన బౌలింగ్లో కీలక రెండు వికెట్లు తీసి మ్యాచ్ను ఆర్సీబీ వైపు తిప్పాడు. దీంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ గెలుస్తుందని అనుకున్నారు.