Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీ20 సిరీస్‌లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఎలా ఆడబోతున్నాడని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదికూడా ఒకటి కాదు.. ఏకంగా 5 రికార్డులు కోహ్లీని ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డ్స్ ఏంటో చూసేద్దామా..
15 వేల వన్డే పరుగులు:
విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో 203 పరుగులు సాధిస్తే వన్డే క్రికెట్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. సచిన్ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు.
Also Read
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లీ:
ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. ఈ రికార్డును తొలి మ్యాచ్‌లోనే అందుకునే అవకాశం ఉంది.
నంబర్-3లో అరుదైన ఘనత:
అంతర్జాతీయ క్రికెట్లో నంబర్-3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 16,000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి మరో 81 పరుగులు అవసరం.
వన్డేల్లో కొత్త చరిత్ర:
వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి కోహ్లీకి 150 పరుగులు మాత్రమే కావాలి. ఈ సిరీస్‌లో మంచి ఫామ్ కొనసాగిస్తే ఈ రికార్డు కూడా అతని ఖాతాలో చేరే అవకాశం ఉంది.
అత్యధిక 50+ స్కోర్ల ఘనత:
ఇంగ్లాండ్‌పై అత్యధిక 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలవడానికి కోహ్లీకి కేవలం ఒక్క 50+ ఇన్నింగ్స్ మాత్రమే అవసరం. ఈ రికార్డు కూడా ఈ సిరీస్‌లోనే అందుకునే అవకాశముంది. ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఫామ్‌లో కనిపిస్తే వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లను చేరుకోవడమే కాకుండా.. టీమిండియాకు సిరీస్ విజయంలోనూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అందుకే ఈ సిరీస్‌లో అభిమానులందరి చూపు కోహ్లీ బ్యాట్‌పైనే నిలిచింది.
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!