Virat Kohli: ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు (డిసెంబర్ 26) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్–1లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 77 పరుగులు చేసి మరోసారి అభిమానులకు తన క్లాస్ ఇన్నింగ్స్ ను రుచి చూపించాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో శతకం మిస్ అయినప్పటికీ, తన దూకుడు ఆటతో అభిమానులను అలరించాడు.
1.5K 144Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న Realme 16 Pro..!
కోహ్లీ 15 ఏళ్ల తర్వాత ఢిల్లీ తరఫున లిస్ట్-A క్రికెట్ ఆడుతుండగా.. ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో 77 పరుగులు చేసి ఢిల్లీ జట్టును 254/9 స్కోరుకు చేర్చాడు. దీనితో లిస్ట్-A క్రికెట్ లో వరుసగా అరవసారి 50+ లిస్ట్-A స్కోర్ నమోదు చేసిన కోహ్లీ విషాల్ జైస్వాల్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతని కెరీర్ లిస్ట్-A సగటు 57.87కి చేరింది. దీనితో ఎన్నో ఏళ్ల నుండి ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ బెవన్ (57.86)పై ఉన్న రికార్డు బద్దలైంది. దీంతో లిస్ట్-A క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సగటు కలిగిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
Champion Collections: క్రిస్మస్ విన్నర్‌గా ‘ఛాంపియన్’.. తొలిరోజే రూ. 4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..!
టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో 208 పరుగులతో కోహ్లీ రన్స్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ తన సత్తా చాటుతూ ఒక అద్భుతమైన క్యాచ్‌ను కూడా అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కెప్టెన్ రిషభ్ పంత్ 70 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా.. ముంబై తరఫున తిరిగి బరిలోకి దిగిన రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ లో సెంచరీతో ధనాధన్ ఇన్నింగ్స్ తో మెరిసిన రోహిత్ ఈసారి మాత్రం నిరాశ పరిచాడు. జైపూర్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దేవేంద్ర బోరా బౌలింగ్‌లో రోహిత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.