ఢిల్లీ మెట్రో ఎప్పుడూ గొడవలకు.. ఘర్షణలకు కేంద్రంగా మారుతోంది. దేశ రాజధాని కావడంతో ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. సీట్ల కోసం మహిళా ప్రయాణికులు ముష్టి యుద్ధాలకు దిగిన సంఘటనలు చూశాం. ఇటీవల మెట్రో రైల్లో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో ముగ్గురు యువకులు డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌కు దిగారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Opinion Polls: బీజేపీ కూటమి ఈ సారి 400 సీట్లు సాధిస్తుందా..? వివిధ సంస్థల ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయి..
ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరు యువకులు.. మరో యువకుడితో ఫైటింగ్‌కు దిగారు. ఇలా ఒకరినొకరు పిడుగుద్దులు గుద్దుకుంటూనే ఉన్నారు. ఒక కుర్రాడో కిందపడిపోగా.. మరో ఇద్దరు పిడుగుద్దులు గుద్దుకుంటూనే ఉన్నారు. తిరిగి లేచిన యువకుడు.. మళ్లీ పంచ్‌లు వేస్తూనే ఉన్నాడు. అక్కడే ఒక పెద్దాయన ఉన్న కూడా అలా చూస్తేనే ఉన్నాడు తప్ప.. విడదీసే ప్రయత్నం చేయలేదు. మరొకరు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. పైగా మెట్రో సిబ్బంది కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా… 4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఏప్రిల్ 16న వీడియోను పోస్టు చేశారు. కానీ ఈ పైటింగ్ ఎప్పుడు జరిగింది అనేది మాత్రం వివరాలు తెలియలేదు. వీడియో నిడివి మాత్రం 17 సెకన్లు ఉంది. దీనిపై నెటిజన్లు రకరకాలైన కామెంట్లు చేస్తున్నారు. యువకుల భుజంపై బ్యాగ్‌లు తగిలించుకుని ఉన్నారు. బహుశా ముగ్గురు స్టూడెంట్స్‌గా కనిపిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Vallabhaneni Balashowry: మరోసారి ఎంపీగా గెలవబోతున్నా.. ఏడు నియోజకవర్గాల్లోనూ నాకే మెజార్టీ..!
విచిత్రమేంటంటే ప్రేక్షకుల్లా ఫైటింగ్ చూశారే తప్ప.. విడదీసే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. చివరికి ఒక వ్యక్తి కలుగజేసుకుని స్టేషన్ చివరికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోపై మెట్రో అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఘటన ఎప్పుడు జరిగింది.. గొడవ పడ్డ ఆ ముగ్గురు యువకులు ఎవరు? అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులైనా చూసి స్పందిస్తారేమో చూడాలి.
Kalesh b/w Two Bois inside Delhi Metro Station, damn those Left hooks🤯
pic.twitter.com/hVVlhxRBr8— Ghar Ke Kalesh (@gharkekalesh) April 16, 2024