Opinion Polls: లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. అయితే, ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి బీజేపీని గద్దె దించుతామని ప్రతిపక్ష ఇండియా కూటమి చెబుతోంది.
ఒపీనియన్ పోల్స్ ప్రతీసారి కరెక్ట్ అవుతాయనే గ్యారెంటీ లేదు. అయినప్పటకీ అన్ని సంస్థలు ఒపీనియన్ పోల్స్ మాత్రం ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తెలిపాయి. బీజేపీ స్వతహాగా 300 స్థానాలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం కలగానే మిగులుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి సమస్యలు ఉన్నప్పటికీ రామ మందిరం, విదేశాల్లో భారత పరపతి పెరగడం వంటివి బీజేపీకి ప్లస్ అవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Civil Services Exam: ఎంతో మందికి స్పూర్తిగా “సారిక”.. అరుదైన వ్యాధితో బాధపడుతూ సివిల్స్ సాధించారు..
వివిధ సంస్థల ఒపీనియన్ పోల్:
టైమ్స్ నౌ-ETG రీసెర్చ్ సర్వే:
సర్వే పబ్లిష్ తేదీ: మార్చ్ 08
ఎన్డీయే(బీజేపీ కూటమి): 358-398
ఇండియా కూటమి: 110-130
ఇతరులు: 64-68
ఏబీపీ- సీ ఓటర్:
సర్వే పబ్లిష్ తేదీ: 16-04-2024
ఎన్డీయే(బీజేపీ కూటమి): 373
ఇండియా కూటమి: 155
ఇతరులు: 15
జీ న్యూస్-మాట్రిజ్:
సర్వే పబ్లిష్ తేదీ: ఫిబ్రవరి 28
ఎన్డీయే(బీజేపీ కూటమి): 377
ఇండియా కూటమి: 94
ఇతరులు: 72
ఇండియా టుడే-సీ ఓటర్
సర్వే పబ్లిష్ తేదీ: ఫిబ్రవరి 08
ఎన్డీయే(బీజేపీ కూటమి): 335
ఇండియా కూటమి: 166
ఇతరులు: 42
టైమ్స్-మాట్రిజ్:
సర్వే పబ్లిష్ తేదీ: ఫిబ్రవరి 07
ఎన్డీయే(బీజేపీ కూటమి): 366
ఇండియా కూటమి: 104
ఇతరులు: 73
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్
సర్వే పబ్లిష్ తేదీ: ఫిబ్రవరి 04
ఎన్డీయే(బీజేపీ కూటమి): 378
ఇండియా కూటమి: 98
ఇతరులు: 67
న్యూస్-18 మెగా ఒపినీయన్ పోల్:
సర్వే పబ్లిష్ తేదీ: మార్చ్
ఎన్డీయే(బీజేపీ కూటమి): 411
ఇండియా కూటమి: 105
ఇతరులు: 27