Viral Video: వివాహా కార్యక్రమం అంటేనే ఆనందోత్సాహంగా జరిగే వేడుక. మన దేశంలో పెళ్లిళ్లు అంటే కుటుంబ సభ్యులు, బంధువుల సందడితోనే ప్రత్యేకంగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబరాల మధ్యే ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలా ఓ పెళ్లి వేడుకలో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వీడియో ప్రకారం, పెళ్లి ఒక ఇంటి మేడపై జరుగుతోంది. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు మంగళ వాయిద్యాల మధ్య పెళ్లికి ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చొని వివాహం జరుగుతున్న తరుణంలో పలువురు బంధువులు, అతిథులు చుట్టూ చేరుకున్నారు. కానీ ఉన్నట్లుఉండి మేడ కుడి వైపున ఉన్నా కొంతమంది గుంపు ఉన్న ప్రదేశం అకస్మాత్తుగా కూలిపోయింది. ఆ ప్రాంతంలో ఉన్నవారు ఒక్కసారిగా నేలపైకి పడిపోయారు.
Read Also: Plane Crash: విమాన ప్రమాదానికి సంబంధించి పలు భయానక ఫొటోలు..!
ఈ ఘటనలో కొందరికి గాయాలు అయ్యాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే అదృష్టవశాత్తు పెళ్లికూతురు, పెళ్లికొడుకుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. వీడియోలో స్పష్టంగా మేడ కూలిన తీరు, అక్కడున్నవారి ఆందోళన చూస్తే ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందో అర్థమవుతుంది. ఇక ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఎత్తు కాబట్టి గాయాలతో సరిపోయింది.. అదే మరింత ఎత్తులో ఉండి ఉంటే పరిస్థితి ఏంటి అని కొందరు ప్రశ్నిస్తుండగా.. మరికొందరేమో, దేవుడి దయవల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ముఖ్యంగా వధూవరులకి ఎటువంటి హాని కలగకపోవడంతో అంత మంచి జరగాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
Read Also: Ahmedabad Plane Crash: అద్భుతం.. ఇనుము కరిగింది కానీ, కానీ క్షేమంగా ఉన్న భగవద్గీత..!