INDIA: చాలామంది వారి ఇళ్లలో పిల్ల పుట్టకముందే వారికి పెట్టబోయే పేర్లను కుటుంబ సభ్యులు అందరూ ఆలోచించడం సహజం. ఎందుకంటే,ఆ పేరు జీవితాంతం వారికి గుర్తింపుగా ఉంటుంది. కానీ, ఒక తల్లి తన కూతురికి ఒక దేశం పేరునే పెట్టింది అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.. అవును ఇందుకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి ఆ వీడియో ఏంటి? అందులో ఏముందో చూసేద్దామా..
సదరు వీడియోలో ఓ ముద్దుల చిన్నారి తన పేరు అడిగితే అమాయకంగా “ఇండియా” అని చెబుతూ చిరునవ్వు చిందిస్తుంది. ఆ చిరునవ్వుతో పాటు ఆ చిన్నారి అమాయకత్వం అందరినీ కట్టిపడేస్తోంది. ఆ చిన్నారి పక్కనే ఆమె తల్లి కూడా ఉంది. తన కూతురికి ఎందుకు ఈ పేరు పెట్టానో చెబుతుంది. ఇంతంకి ఆ మహిళా తన చిన్నారి పాపకి ఏ పేరు పెట్టిందో అనే కదా మీ అనుమానం.. ఇంకా అర్థం కాలేదా.. ఆ పాపా పేరు ‘ఇండియా (India)’. అవును మీరు ఉహించనిదే ఆ అమ్మాయి పేరు. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి పాపా పేరు చెప్పగానే ఆశ్చర్యపోయాడు.
Hussain Sagar: ‘హుస్సేన్ సాగర్’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఆ తర్వాత చిన్నారులు ఇండియా అన్ని ఎందుకు పేరు పెట్టారని అతన తల్లిని అతడు అడగగా.. ఆమె మాటల్లో భారతదేశం పట్ల ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపించింది. ఆమె మాట్లాడుతూ.. “భారతదేశం ఒక అందమైన దేశం.. ఇక్కడి సంస్కృతి, వైవిధ్యం ఎంతో గొప్పవి” అని పేర్కొంది. ఈ ఒక్క మాట విన్న వినడంతో ఆ వీడియోకి చిత్రీకరిస్తున్న వ్యక్తితోపాటు ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వం ఉప్పొంగింది. అందిన సమాచారం ప్రకారం.. ఈ చిన్నారి, ఆమె తల్లి అమెరికాలో నివసిస్తున్నారు. అయితే అధికారికంగా ఈ విషయం ధృవీకరించబడలేదు. కానీ తల్లి మాటలు, పిల్ల హావభావాలు చూస్తే భారత సంస్కృతి, సౌందర్యంపై వారికి ఉన్న అభిమానమే ప్రధాన కారణమని అర్థమవుతుంది. ఏది ఏమైనా భర్తదేశంలో నివసిస్తున్న మనకి కూడా ఇలాంటి ఆలోచన వచ్చిండదు కదా మన వారికి ఇలాంటి పేరు పెట్టవచ్చని.
40 గంటల బ్యాటరీ లైఫ్, IP68 సర్టిఫికేషన్, AI ఆధారిత Google Pixel Watch 4 లాంచ్..!
ఇక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చాలా కొద్దిసేపటికే వైరల్ గా మారింది. వేలాది మంది కామెంట్లతో స్పందిస్తున్నారు. ఇందులో కొందరు “ఈ చిన్నారి వీడియో నా రోజును సంతోషంగా మార్చేసింది” అని అంటుండగా.. మరికొందరేమో “ఈ వీడియో చూసిన తర్వాత తాను భారతీయుడిని అయినందుకు నిజంగానే గర్వంగా అనిపిస్తుంది” అని కామెంట్స్ చేశారు.