రైళ్లో అన్ని రకాల తినుబండారాలతో టీ, కాఫీలు కూడా వస్తుంటాయి.. రైళ్లో ఒక పెద్ద క్యాంటీన్ ఉంటుంది.. ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఏదోకటి వస్తూనే ఉంటాయి.. వాటిని తీసుకురావడం లేదా తయారీ విధానం పై ఎప్పుడూ ఏదోకటి కంప్లైంట్ వస్తూనే ఉంటుంది.. అయితే చాలా మందికి రైళ్లో వచ్చే నచ్చదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు.. అది రుచిగా ఉండదు.. వేడి నీళ్లు లాగా ఉంటుంది.. అందుకే టీ తాగాలంటే పెద్ద సాహసమే చెయ్యాలి.. తాజాగా ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఆ వైరల్ అవుతున్న వీడియోలో, ఇద్దరు వ్యక్తులు రైలులో కూర్చుని టీ తయారు చేస్తున్నారు. పాలను స్టీల్ క్యాన్‌లో ఉంచి దానిలో నీటిని వేడి చేసే హీటర్ రాడ్ పెట్టారు. ఆ హీటర్ సహాయంతో పాలను వేడి చేశారు. ఓ ప్రయాణికుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భారతీయ రైల్వే మీకు ఇలాంటి టీ అందిస్తోంది. వారు ట్యాప్ వాటర్‌ను, హీటర్‌ను ఉపయోగిస్తున్నారని కామెంట్ చేశాడు.. ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ గా మారింది..
ఈ వీడియోను ఇప్పటివరకు 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి… ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. భారతదేశంలో పరిశుభ్రత చట్టవిరుద్ధమని మీకు తెలుసా?, అందుకే రైళ్లలో తాగే టీ రుచి వేడి నీళ్లలా ఉంటుంది, ఆహారం విషయంలో రైల్వే తీరు ఎప్పటికీ మారదు..ఇది కచ్చితంగా ఉత్తర భారతదేశంలోనే అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేసుకోండి..