Viral : అమ్మాయి ప్రేమకు పులి కూడా దాసోహం..! ఈ వీడియో చూస్తేగానీ నమ్మరు..!
- చిరుతలు, సింహాలు, పులులు... ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది
- తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది
- ఇందులో ఓ అందమైన అమ్మాయి ఏకంగా ఒక పెద్ద చిరుతను పిల్లిలా లాలించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : చిరుతలు, సింహాలు, పులులు… ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటి భయంకరమైన గర్జన గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్ని క్షణాల్లో మట్టుబెట్టే శక్తి వాటి సొంతం. అందుకే వాటిని చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కానీ, కొందరు మాత్రం సాహసం అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటి వారే ఈ అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇందులో ఓ అందమైన అమ్మాయి ఏకంగా ఒక పెద్ద చిరుతను పిల్లిలా లాలించడం, ముద్దులు పెట్టడం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Shabbir Ali : కామారెడ్డి ప్రజల లైఫ్ లైన్ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
సాధారణంగా మనం ఇంట్లో కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటాం. వాటితో ఆడుకుంటాం, ప్రేమగా నిమురుతాం. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఏకంగా ఒక పెద్ద చిరుతనే తన పెంపుడు జంతువులా భావిస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఆ చిరుత కూడా ఈ అమ్మాయి పట్ల ఎంతో ప్రేమగా, ఒక పిల్లి పిల్లలాగా ప్రవర్తిస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యానికి సంబంధించిన వీడియోను లిసాటోరాజాక్వెలైన్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, ఒక భారీ చిరుత మెల్లగా ఒక అమ్మాయి వైపు నడుచుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయి కూడా ఎలాంటి భయం లేకుండా చిరుతను దగ్గరకు తీసుకుని ప్రేమగా హత్తుకుంది. అంతేకాదు, దాని నుదుటిపై ముద్దు కూడా పెట్టింది. ఆ దృశ్యం చూస్తుంటే నిజంగా ఇది కలా? అన్న అనుమానం రాక మానదు. అంత భయంకరమైన జంతువు ఒక అమ్మాయి ప్రేమకు ఎలా దాసోహం అయిపోయిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.
లక్షల్లో వ్యూస్.. వేలల్లో కామెంట్స్!
ఏప్రిల్ 6న ఈ వీడియోను షేర్ చేయగా, కొద్ది రోజుల్లోనే 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే” అని ఒక యూజర్ కామెంట్ చేస్తే, “ఈ దృశ్యం నిజంగా చాలా అందంగా ఉంది” అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఒక అమ్మాయికి, ఒక క్రూరమైన జంతువుకు మధ్య ఉన్న ఈ అపురూపమైన బంధాన్ని చూసి చాలా మంది ముగ్ధులవుతున్నారు. నిజంగా ప్రేమ ముందు ఎలాంటి భయమైనా చిన్నబోతుంది అనడానికి ఇదే నిదర్శనం కదూ! అమ్మాయిల ముందు పులి కూడా పిల్లే మరి..
Minister Parthasarathy: అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..! వాళ్లు రాజధానిగా గుర్తించాల్సిన పనిలేదు..
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!