ఇంటి స్థలం విషయంలో గల్లీ లీడర్లే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తుంటారు. బడా నాయకులు అయితే తమ పలుకుబడితో ఏకంగా వార్నింగ్ ఇస్తుంటారు. హైడ్రా వచ్చాక ఇలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్‌ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
Also Read: KTR: కవిత సస్పెన్షన్ తర్వాత.. మొదటిసారి మీడియా ముందుకు కేటీఆర్! ఏమన్నారంటే?
సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి ఇంటి కాంపౌండ్‌ను కూల్చారు. ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తంను పడగొట్టారు. ఇందుకు సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జనాలు రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శం’, ‘సీఎం తల్చుకుంటే అక్కడ రోడ్డు వేయడాన్నే ఆపేవారు, కానీ ఆలా చేయలేదు’, ‘ప్రజల శ్రేయస్సే సీఎం కోరుకున్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సీఎం ఇంటి కాంపౌండ్‌ను కూల్చారు.
During the road widening project in Kondareddypalli, the native village of CM Revanth Reddy, officials demolished the CM’s house compound.… pic.twitter.com/up1QmlynMq
— Congress for Telangana (@Congress4TS) September 8, 2025