NTV Telugu Site icon

Viral Video: ఎంత తింటావ్‌ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు

Viral

Viral

Viral Video: గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి, “సిగ్గుండాలి మీకు… ప్రజల సొమ్ము తింటూ బలిసిన దున్నపోతులా తయారయ్యారు?” అంటూ తీవ్రంగా విమర్శలు చేసారు. లంచగొండితనానికి సంబంధించిన తమ ఆవేదనను వారు వ్యక్తపరిచారు.

Also Read: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!

ఇక తమ సమస్యలను అతనికి వివరించడంలో ప్రజలు ఆగ్రహానికి లోనయ్యి అతని మొహం మీద డబ్బు కట్టలు విసిరారు. “ఇదిగో తీసుకో.. ఎంత కావాలో తిను” అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తెలుపుతూ.. కాలనీలో మురికినీరు వస్తుందనీ, పనులు చేయించాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇంత పెద్ద ఘటన జరుగుతుండగా.. ఆ అధికారి మాత్రం ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అతని నిర్లక్ష్యపు వైఖరి చూసిన ప్రజలు ఆఫీసర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.

Also Read: Manchu Manoj: పీఎస్‌లో ఫిర్యాదు.. మంచు మనోజ్‌కు అస్వస్థత..!

“ఇదిగో చూడండి.. ఎంత అక్రమంగా సంపాదించినా కడుపు నిండదు. ప్రజలే సరైన గుణపాఠం చెప్పారు” అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వీడియో వీర అవ్వడంతో అనేక మంది స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి స్థాయి దారుణంగా పెరిగిందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో ప్రజలు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

Show comments