పెళ్లయిన మహిళ గర్భం దాల్చిన తర్వాత 7 నుంచి 10 నెలల మధ్యలో పండంటి బిడ్డలను కనడం మామూలుగానే చూస్తాం. కాకపోతే ఓ మహిళ మాత్రం తనకు తెలియకుండానే 56 సంవత్సరాల పాటు గర్భంతో ఉంది. కొన్ని రోజుల క్రితం ఆమెకు సడన్ గా కడుపునొప్పి రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. దాంతో అసలు విషయం బయటపడింది. మొదటిగా ఆమె పరిస్థితి చూసిన డాక్టర్లు షాక్ అయిపోయారు. ఈ సంఘటన బ్రెజిల్ దేశంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Kadapa Crime: కడపలో విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
బ్రెజిల్ దేశ మీడియా కథనాల ప్రకారం ఆ మహిళ పేరు డానియేలా వెరా. ఆవిడ ప్రస్తుత వయస్సు 81 సంవత్సరాలు. అయితే ఆవిడ దాదాపు గత ఐదు దశాబ్దాలుగా కడుపులో పిండాన్ని మోస్తూ ఉంది. కాకపోతే ఆ పిండం మృతి చెందింది. చాలా సంవత్సరాల క్రితమే ఆమె కడుపులో ఉన్న పిండం చనిపోయింది. నిజానికి ఈ విషయాలు ఏవి ఆ మహిళకు తెలియకపోవడం విచిత్రం. అలా చాలా సంవత్సరాల పాటు మృతి చెందిన పిండం కడుపులో ఉండగా అది కాస్త కడుపులో గడ్డకట్టుకుపోయింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నా తాజాగా ఆమెకు కడుపులో బాగా నొప్పి వచ్చింది. అయితే వృద్ధురాలు కావడంతో ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించారు.
Also Read: TS EAPCET 2024: అలర్ట్… తెలంగాణ ఎంసెట్, ఐసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు..!
అయితే చికిత్సలో భాగంగా డాక్టర్లు వృద్ధురాలికి ఎక్సరే తీశారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. నిజానికి ఎక్సరే చూసిన డాక్టర్లు నోరెళ్లబెట్టారు. పిండం చాలా సంవత్సరాల క్రితమే మరణించిందని అలా మరణించిన పిండం గడ్డ కట్టకపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే దానిని తొలగించాలన్న సమయంలో వృద్ధురాలిని చాలా రోజులు హాస్పిటల్లో ఉంచి ఆ తర్వాత మార్చి 15న ఆపరేషన్ చేసి పిండాన్ని బయటికి తీశారు. కాకపోతే ఆ తర్వాత సదరు వద్దురాలు ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవలే మృతి చెందింది. ఇలాంటి పరిస్థితులు గర్భసంచికి పిండం మరోవైపు ఏర్పడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని డాక్టర్లు తెలిపారు.