Site icon NTV Telugu

B.Vinod Kumar: తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారు.

Vinod Kumar

Vinod Kumar

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు మమ్ములను ప్రశ్నలు అడిగారు.. ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల సామాజిక మాధ్యమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాయని తెలిపారు. వారి విమర్శలను తిప్పికొట్టడంలో నిర్లిప్తత చేయడంతో నష్టం చేకూరిందని అన్నారు. తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అనే దానిపై బండి సంజయ్ విమర్శించారని పేర్కొన్నారు.

Operation Valentine : ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ఫస్ట్ స్ట్రైక్ రిలీజ్ టైం ఫిక్స్..

ఆర్బీఐ లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎస్ఓటిఆర్ ద్వారా తెలంగాణా ప్రభుత్వం పన్నులలో 82.4 శాతం ఇస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు దరి దాపులలో లేవని వినోద్ కుమార్ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పార్టీ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల పరిస్థితి అని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి చెబుతున్నారు కానీ.. స్థిరాస్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు.
లక్షల ఎకరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేసి రాష్ట్రాభివృధ్ధికి తోడ్పడిందని తెలిపారు. ఋణాలు తీసుకొని అభివృద్ధి చేయడం అప్పు కింద రాదని పేర్కొన్నారు.

Minister Seethakka: గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క

తెలంగాణలో బలమైన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలలో బీజేపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉండబోతోందని ఆరోపించారు. మొదటి తేది జీతాలు ఇవ్వలేదన్న బండి సంజయ్, బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాలలో రెండు మూడు నెలలకొకసారి ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు. తెలంగాణ అప్పుల రాష్ట్రమని ప్రజలను భయపెట్టడం మానుకోండని హితవు పలికారు.

Exit mobile version