Vinaro Bhagyamu Vishnu Katha: యువ నటులు కిరణ్ అబ్బవరం, కశ్మీరా పరదేశి హీరోహీరోయిన్లు రాబోతున్న రొమాంటిక్ డ్రామా వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రం దాని సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ప్యానెల్ సినిమాని థియేట్రికల్ రిలీజ్ కోసం క్లియర్ చేసి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫిబ్రవరి 18న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ప్రీ రిలీజ్ బజ్ చాలా పాజిటివ్‌గా ఉంది. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు.
NTR: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ మూవీగా నిలుస్తుండటంతో ఈ హీరో నటించే సినిమాలకు సగటు ప్రేక్షకులు ఎక్కువగా వస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్ మొదలుకొని టీజర్, ట్రైలర్ల వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర ఆడియో లాంచ్‌ను ఫిబ్రవరి 12న సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కథ సరికొత్త నేపథ్యంలో వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరో లెవెల్‌కు చేరుకుంది.