కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది.వరుస సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది.తంగలాన్ విడుదల తేదీపై రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ప్రకటన ఉండబోతుందని నిర్మాత ధనుంజయన్ ఓ ఇంటర్వ్యూ లో తెలియజేశారు.
విక్రమ్ డెడికేషన్ కు మైండ్‌బ్లోయింగ్‌గా ఉండబోతుందని ఆయన తెలిపారు. తంగలాన్ ల్యాండ్ మార్క్ సినిమా గా నిలువడం ఖాయమని ఆయన అన్నారు. ఈ మూవీ లో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి మాళవికా మోహనన్ లుక్ ను విడుదల చేయగా.. ఇదివరకెన్నడూ చూడని విధంగా డీగ్లామరైజ్‌డ్‌గా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు పా రంజిత్.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..ఇప్పటికే మణి రత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 సినిమాల తో విక్రమ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. తాజాగా విక్రమ్ నటిస్తున్న దృవ నచ్చత్రం సినిమా విడుదలకు సిద్ధం గా వుంది.ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ మేనన్ తెరకెక్కించారు.. హై వోల్ట్ యాక్షన్ మూవీ గా ఈ సినిమా తెరకెక్కింది…