Vikram : కమల్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే బుకింగ్ ప్రారంభం కావడంతో టిక్కెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. ఆదిత కరిగలన్ పాత్రలో నటించిన నటుడు విక్రమ్, ఇటీవల జరిగిన ‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రమోషన్ ఈవెంట్లో కమల్ హాసన్ సినిమాలో ఎందుకు నటించలేదో వివరించాడు. ఎంజీఆర్ నుంచి కమల్‌హాసన్ ‘పొన్నియన్ సెల్వన్’ హక్కులు పొందారు. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి ‘పొన్నియన్ సెల్వన్’ నవలను టీవీ సిరీస్‌గా తీయాలనే ఆలోచనలో ఉన్నానని, అందులో ఎలాంటి పాత్రనైనా ఎంచుకోమని ఆఫర్ ఇచ్చినట్లు విక్రమ్ తెలిపారు.
Read Also: Shahrukh Khan : షారూఖ్‌కు షాక్.. కోర్టు ఏమన్నదంటే
Also Read
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
కానీ తనకు టీవీ సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదని, ‘పొన్నియన్ సెల్వన్’ నవలను సినిమాగా తీస్తే ఎలాంటి క్యారెక్టర్లోనైనా నటించేందుకు సిద్ధమని విక్రమ్ తెలిపాడు. అయితే అదే సమయంలో ‘పొన్నియన్ సెల్వన్’ కథలో ఎలాంటి పాత్రనైనా ఎంచుకునే స్వేచ్ఛ తనకు ఇచ్చినందుకు కమల్ హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘పొన్నియన్ సెల్వన్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండవ భాగం అంతకంటే ఎక్కువ వసూలు చేస్తుందని చిత్ర బృందం అంచనాలు వేస్తున్నారు. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, విక్రమ్ ప్రభు, ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, పార్థిబన్, ప్రకాష్‌రాజ్, రఘుమాన్, కిషోర్, అశ్విన్, షాడోస్ రవి, రియాస్ ఖాన్, లాల్, మోహన్ రామన్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్ 2′కి AR రెహమాన్ సంగీతం అందించారు.
Read Also: Anchor Sreemukhi: పెళ్లికూతురుగా శ్రీముఖి అదుర్స్.. వేదిక ఎక్కడంటే
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!