విజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఈ హీరో.. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం విజయ్ ఆంటోని ‘విక్రమ్ రాథోడ్’ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఎంతో గ్రాండ్ గా రూపొందిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ మూవీని డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు… ఆ తర్వాత సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయని అంటున్నారు.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ మంచి బజ్ ను తీసుకొచ్చాయి..
అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి, ఎస్.కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు… ఇంకా ఈ సినిమాలో సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటించారు..