Vande Bharat: ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. కొంత కాలంగా ఈ రైలుపై కసరత్తు చేస్తున్న అధికారులకు తాజాగా రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించింది. ఈ నెల 7న ప్రారంభ ముహూర్తంగా నిర్ణయించారు. ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చ్యువల్ గా ప్రారంభించనున్న జాబితాలో ఈ రైలును చేర్చారు. రూటు.. ధరలు ఖరారు చేశారు. ఈ నెల 8వ తారీఖు నుంచి రైలు రాకపోకలు నిరంతరాయంగా అందుబాటులోకి రానున్నాయి.
Read Also:Health Care: కుటుంబ ఖర్చులో 10 శాతం ఆరోగ్య రక్షణకే … కొందరైతే 25 శాతం వరకు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖ, సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ఈ సంవత్సరమే ప్రధాని మోడీ వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ఇప్పుడు మూడో ట్రైన్ రానుందని చెబుతున్నారు. ఈ రెండు రైళ్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందేభారత్ రైళ్ల నిర్వహణ దిశగా రైల్వే శాఖ కసరత్తు చేసింది. అందులో భాగంగా రెండు రైళ్లను ఈ నెలలోనే ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ – చెన్నై రూట్ లో వందేభారత్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ప్రధాని ఈ రైలును వర్చ్యువల్ గా ప్రారంభిస్తారు. ఈ లైన్ లో రద్దీ…డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని ఈ మార్గానికి అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు.
Read Also:Rahul Gandhi: అమరావతిపై దృష్టిపెట్టిన రాహుల్.. రంగంలోకి ప్రియాంక గాంధీ, విశాఖలో..
విజయవాడ నుంచి చెన్నై మధ్య స్టాపులు ఏంటి.. ట్రైన్ టైమింగ్ ఎలా ఉంటాయి.. టిక్కెట్ రేటు ఎంతుంటుంది.. ఆ వివరాలన్నీ త్వరలోనే వెలువడనున్నాయి. ఈ రైలును రేణిగుంట మార్గం గుండా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు విన్నవించినట్లు సమాచారం. అలా చూసుకుంటే విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి గుండూ చెన్నై వెళ్లి.. అదే రూటులో తిరిగి రానుంది. విజయవాడ-తిరుపతి మధ్య ప్రయాణించే పాసింజర్స్ రద్దీ నేపథ్యంలో.. ఈ వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రధాన రైళ్ల రాకపోకలపై ప్రభావం ఉండకుండా ఉదయం సమయాల్లోనే ఈ రైలును నడిపేలా కసరత్తు చేస్తున్నారు.