Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో పెట్టిన సభ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏపీ పై కూడా దృష్టి సారించింది. ఆ దిశలోనే అడుగులు వేస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని గతంలోనే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే అంశంతో ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కార్మికులకు అండగా ఉండాలనుకుంటోంది. ఇందుకు ఆ పార్టీ కార్యకర్తలకు రాహుల్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఖరారు చేశారు. ఖమ్మం సభలో పాల్గొన్న అనంతరం రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో గన్నవరం నుంచి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో కాసేపు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ రాజకీయాల పైన చర్చించారు. ఏపీ రాజధాని..విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలను రాష్ట్ర నేతలు రాహుల్ కు వివరించారు. ఈ సమయంలో అమరావతి రాజధాని..విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాహుల్ మరోసారి పార్టీ విధానం స్పష్టం చేశారు. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Read Also:Jonny Bairstow Run-Out: మరోసారి ఆస్ట్రేలియా చీటింగ్.. అనూహ్య రీతిలో బెయిర్‌స్టో అవుట్! (వీడియో)
త్వరలోనే రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ అమరావతిలో పర్యటిస్తారని.. భూములిచ్చిన రైతులకు అండగా నిలుస్తారని ప్రకటించారు. ఏపీకి రాజధాని లేకపోవటం బాధాకరమన్నారు. అమరావతిలో ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న నిర్ణయాలను పార్టీ నేతలు రాహుల్ కు వివరించారు. విభజన చట్టంలోని హామీల అమలు.. పోలవరం ప్రాజెక్టు పనులు.. రాజధాని నిర్మాణం.. ప్రత్యేక హోదా వంటి అంశాల్లో ఏపీకి అన్యాయం జరుగుతోందని ఒక నివేదిక రూపొందించి అందజేశారు. కేంద్రంలోకి అధికారంలోకి రాగానే ప్రతీ ఒక్క హామీని నెరవేర్చుతామని రాహుల్ వారి భరోసా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నామన్నారు. ఇదే సమావేశంలో అధికార బీజేపీతో ఏపీలోని రాజకీయ పార్టీల సంబంధాల పైనా రాహుల్ పార్టీ నేతలతో కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వైసీపీ.. తెలుగుదేశం.. జనసేన పార్టీలు ఏం చేస్తున్నాయి.. ఆ పార్టీల పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే కోణంలో పార్టీ నేతల ద్వారా రాహుల్ తెలుసుకున్నారు. ఈ మూడు పార్టీలు బీజేపీతో కలిసే ఉన్నాయని.. రాష్ట్రంలో మాత్రం గందరగోళంగా వ్యవహరిస్తున్నాయని పార్టీ నేతలు రాహుల్ కు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కారం- తొలి గ్యారంటీ ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే నెలలో విశాఖ సభ నిర్వహిస్తానని అందులో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు తమ పార్టీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
Read Also:Mexico: మొసలిని పెళ్లి చేసుకున్న మెక్సికో మేయర్.. ఎందుకో తెలుసా?