కేసీఆర్ సర్కార్ పాలనలో లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందని, లీకేజీ బయటపడేసరికి మాకు సంబంధం లేదని తండ్రీకొడుకులు తప్పించుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఒక సాధారణ ఉద్యోగులు ఛైర్మన్ చాంబర్ కు వెళ్లి లీకేజీ చేయగలరా? అసాధ్యం. కచ్చితంగా లీకేజీ లో తండ్రీకొడుకుల పాత్ర ఉందని, సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్… ఇల్లీగల్ గా, క్రిమినల్ పనులు సంతోషంతో చేయడమే కేసీఆర్ పని. ఆయనకు కావాల్సింది లాభమేనన్నారు. ఇయాళ లీకేజీతో పార్టీకి చెడ్డపేరు రావడంతో నిరుద్యోగుల ఫీజులు మాఫీ చేస్తామని, ఫ్రీ బువ్వ పెడతామంటున్నారు.. మీకేమైనా దిమాక్ ఉందా? 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బకొట్టిన మీరు.. నిరుద్యోగులకు ఫ్రీగా బువ్వ పెడతామంటారా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.
Also Read : GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది
గతంలో గ్లోబరీనా సంస్థ నిర్వాకంవల్ల చనిపోయిన పిల్లల ప్రాణాలు తీసుకొస్తారా? కేసీఆర్ పాలనలో విద్య సర్వనాశనమైంది. 30 వేల స్కూళ్లు మూతపడ్డాయి. కేసీఆర్ కు విద్యలో, వైద్యంలో, భూముల్లో, లిక్కర్ లో కమీషన్లు కావాలి…. డబ్బు కేసీఆర్ కు పెద్ద జబ్బు… వెళ్లి ఆసుపత్రిలో చెక్ చేసుకో… నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైపోతుంటే తప్పించుకుని తిరుగుతున్న కేసీఆర్ కు సిగ్గు లేదు… నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న బండి సంజయ్ కు సిట్ నోటీసులు, కేటీఆర్ లీగల్ నోటీసులిస్తారా? ఏం తప్పు చేశారు? కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్. విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులారా… మౌనం వీడండి… కదిలి రండి…పోరాడండి… బీజేపీ మీకోసం పోరాడుతోంది. తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమం మొదలైంది… కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టి బీజేపీ పాలనను తీసుకొద్దాం.. కచరా ప్రభుత్వం మనకొద్దు’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
Also Read : IPL 2023 : అన్‌బాక్స్ ఈవెంట్ కోసం RCBలో చేరిన గేల్, AB డివిలియర్స్