కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” .దళపతి విజయ్ 68 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.పాపులర్ పొలిటిషియన్,దివంగత నటుడు విజయ్‌కాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం.ఈ సినిమాలో విజయ్‌తో వచ్చే సన్నివేశాల్లో ఏఐ టెక్నాలజీ సాయంతో విజయ్ కాంత్‌ను చూపించబోతున్నారని సమాచారం. విజయ్ కాంత్ ఏఐ వెర్షన్‌ను చూపించే విషయంలో తన అనుమతి కోసం వెంకట్ ప్రభు తన ఇంటికీ పలు సార్లు వచ్చారని విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు .
తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని భౌతికంగా అందరికీ దూరమైన విజయ్ కాంత్‌ను ఇప్పుడు డైరెక్టర్ వెంకట్ ప్రభు వెండి తెర ఫై ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి గా మారింది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన స్టిల్స్‌లో విజయ్ ఓల్డ్ మ్యాన్‌గాను అలాగే యంగ్ లుక్‌లోను కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచాడు . పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ,ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్ మరియు జయరాం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది.ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు.