Vijay Jananayagan: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో తమిళ హీరో విజయ్ ‘జననాయగన్’ ఆడియో రిలీజ్ గ్రాండ్‌గా జరిగింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్‌కి ఇదే లాస్ట్ మూవీ అని టాక్ నడవడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ ఈవెంట్‌కు వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన హీరో విజయ్ అభిమానులతో ఈవెంట్ ప్రాంగణం అంతా సందడి నెలకొంది. ఇదే టైంలో విజయ్ స్టేజీపైకి వచ్చాడు.
READ ALSO: Prabhas: స్టేజ్ మీద గుక్క పెట్టి ఏడ్చిన మారుతి.. ఓదార్చిన ప్రభాస్
హీరో స్టేజీపైకి రాగానే అభిమానుల నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ఈ క్రమంలో కొందరు ‘టీవీకే.. టీవీకే’ అంటూ విజయ్ పార్టీ పేరును నినదించడం ప్రారంభించారు. అది గమనించిన విజయ్.. ఈ ఆడియో రిలీజ్ వేడుకలో ఎలాంటి రాజకీయ పరమైన నినాదాలు చేయకూడదని తన అభిమానులకు సున్నితంగా ఇక్కడ అవి వద్దమ్మా అంటూ సైగలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలేసియా పోలీసులు టీవీకే జెండా రంగులతో కూడిన వస్తువులపై కూడా ఆంక్షలు విధించారు. దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం జననాయగాన్. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, మమిత బైజు కీ రోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
READ ALSO: Maruthi: ఆఫ్రికాలో ఆ జాతి వాళ్లకు కూడా ప్రభాస్ తెలుసు