Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్‌ఫుల్ కంటెంట్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతుండగానే, మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తన ఇతర సినిమాలతో ఇబ్బంది కలగకుండా, ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు పక్కా ప్లాన్‌తో ఉన్నాడు రౌడీ స్టార్. ఇవే కాదు విజయ్ లైనప్‌లో ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ల సినిమాలు క్యూరియాసిటీ కలిగిస్తున్నాయి. మనం, 24 వంటి విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్‌తో యూవీ క్రియేషన్స్ ఒక సినిమాను ప్లాన్ చేసింది. నిజానికి ఈ మూవీ మొదట హీరో నితిన్ కోసం ప్లాన్ చేసినప్పటికీ, చివరికి ఇందులో విజయ్ హీరోగా కన్‌ఫామ్ అయ్యాడు. అలాగే హాయ్ నాన్నతో మెప్పించిన శౌర్యువ్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. నానితో చేయాల్సిన ప్రాజెక్ట్ వాయిదా పడటంతో, శౌర్యువ్ చెప్పిన కొత్త స్క్రిప్ట్‌కు విజయ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నాలుగు చిత్రాలే కాకుండా, మరో రెండు భారీ ప్రాజెక్టుల కోసం విజయ్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాడు. వచ్చే ఏడాది వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెళ్లి తర్వాత ఏమాత్రం విరామం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రౌడీ స్టార్ దూసుకుపోతున్నారు. రాబోయే రెండు మూడేళ్లు విజయ్ దేవరకొండ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి ఈ మెగా లైనప్‌తో విజయ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- Vijay-Governor: విజయ్‌కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!