ఈ మధ్య సెలెబ్రేటీలు వాడుతున్న వస్తువులు వాటి ధరలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి ఖరీదైనవిగా ఉండటమే కాదు.. ప్రత్యేకంగా ఉండటంతో అందరు గూగుల్ లో ఎక్కువగా వీటి గురించి వెతుకుతున్నారు.. తాజాగా మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ లో పెట్టుకున్న కళ్ళజోడు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు విజయ్. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మొజాయిక్ ప్యాచ్‌లతో సెట్ చేసిన చిక్ ఆఫ్ వైట్ హుడీతోపాటు.. లగ్జరీ బ్రాండ్ గివెన్చీ గాగూల్స్ ను పెట్టుకున్నాడు.. ఆ గాగుల్స్ వైపే అందరి చూపు పడింది.. దాని లుక్ మాత్రమే కాదు ధర కూడా అందరిని ఎక్కువగానే ఉంది..
విజయ్ ధరించిన స్టైలిష్ గాగుల్స్ రేటు 1.58 లక్షలు అని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి..ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ కేవలం గాగుల్స్ కోసం లక్షకు పైగా డబ్బులు పెట్టాడంటే.. ఇక మిగిలిన వస్తువులు ఎంత ధర ఉంటాయో అని నెటిజన్లు కూడా పెద్ద చర్చ చేస్తున్నారు.. స్టైలిష్ గాగుల్స్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నారు… మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తుంది.. ఇక విజయ్ దేవరకోండ చేతిలో మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాడు..