Vijay Antony Said I Will Not Use Sandals in Future Also: కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దాదాపుగా మూడు నెలల నుంచి తాను చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని, భవిష్యత్‌లో కూడా చెప్పులు వేసుకోను అని చెప్పారు. చెప్పులు వేసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని తెలిపారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ బుధవారం విడుదల అయింది.
Also Read: Varshangalkku Shesham OTT: ఓటీటీలో మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తుఫాన్ టీజర్ విడుదల కార్యక్రమంకు విజయ్ అంటోని చెప్పులు లేకుండా వచ్చారు. దాంతో మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా? అని మీడియా ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పారు. ‘నేను ఏ దీక్షలో లేను. దాదాపుగా 3 నెలల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఒకరోజు నేను చెప్పులు లేకుండా నడిచాను. అప్పుడు నాకు బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది. ఆరోగ్యానికి కూడా మంచిదే కాకుండా కాన్ఫిడెన్స్‌ను పెంచుతుంది. చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభినప్పటినుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. అందుకే జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నా’ అని విజయ్ అంటోని చెప్పారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని పలు నివేదకలు పేర్కొన్న విషయం తెలిసిందే.