మనుషులు కొంచెం ప్రేమని చూపిస్తే.. చాలు పశువులు,పక్షులు కూడా మంచి స్నేహితులు అవుతాయి. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిలిచాయి. ఇటీవల ఆరిఫ్ కాన్ గుర్జార్, సరస్ క్రేన్ మధ్య ఉన్న ప్రత్యేకమైన ఫ్రెండ్ షిప్ చేిసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మౌలోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరైపర్ మాలిక్ గ్రామంలో నివాసించే రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో ఈ స్టోరీ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారాన్ని రామ్ సముజ్ యాదవ్ ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది.
Also Read : BJP Praveen Kammar: బీజేపీ యువ నేత దారుణ హత్య.. అదుపులోకి నిందితులు
అనంతరం రామ్ తోనే కలిసి సరస్ కొంగ జీవించడం ప్రారంభించింది. త్వరలోనే ఆ బంధం మరింత బలపడింది అని రామ్ సముజ్ యాదవ్ చెప్పుకొచ్చాడు.రామ్ సరస్ క్రేన్ తో ఆడుకుంటాడు. తన చేతులతో స్వయంగా ఆ కొంగకు ఆహారం తినించాడు.. అయితే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సరస్ క్రేన్.. రామ్ సముజ్ యాదవ్ మధ్య హృదయాన్ని కదిలించే ఫ్రెండ్ షిప్ ఉంది అనే క్యాప్సన్ తో
ఓ ప్రముఖ వార్త సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీడియోలో సరస్ క్రేన్.. రామ్ సముజ్ యాదవ్ తో చాలా సరదగా గడుపుతోంది. అతనితో సరదాగా నడుస్తోంది. అతని సమక్షంలో కొంగ చాలా సౌకర్యంగా ఉంది. అయితే వాస్తవంగా సరస్ క్రేన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి.. ఈ కొంగను ఇంట్లో పెంచుకోవడం చట్టవిరుద్దం. దీంతో కొంగకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే.. అటవీ శాఖ అధికారులు గత నెలలో పక్షిని తీసుకువెళ్లారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉంచారు.
Also Read : Taapsee Pannu: ఏరు దాటాక తెప్ప తగలేస్తున్నావా.. సిగ్గులేదు