గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పై హైఫ్ ను పెంచేశాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల సెట్స్ నుంచి పోస్టర్ లేదా వీడియోలు లీక్ అవ్వడం కామన్ అయిపొయింది.. సినిమా మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొకటి లీక్ అవుతుంది.. మొన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నుంచి లీక్ అవ్వగా.. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సెట్స్ నుంచి కూడా ఓ వీడియో లీక్ అయ్యింది.. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లో జాన్వీతో ఓ సాంగ్, కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కినుంచనున్నారు.. గోవా సముద్రం దగ్గర షూటింగ్ జరుగుతుంటే ఎవరో దూరంగా ఉండి, వీడియో తీశారు..
ఆ వీడియోలో ఎన్టీఆర్ మాస్ లుక్ లో నల్ల పంచె, చొక్కా, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.. సముద్రం దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తుంది.. ఈ వీడియో పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.. దేవర టీమ్ కు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.. ఇక ఈ సినిమా రెండు పార్టులు రాబోతుంది.. మొదటి పార్ట్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సర్ ప్రైజ్ గా సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం..