Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదట ఓటు వేశారు. అనంతరం రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలందరూ వరుసగా ఓట్లు వేశారు. ఇంతలో ఓ ఆసక్తికరమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఓటు వేయడానికి వచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనతో ఉన్నారు. ఇద్దరు నాయకులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని క్యాంపస్‌కు వచ్చారు. ఇద్దరూ చాలా సేపు ఇలాగే నడుస్తూ నవ్వుతూ మాట్లాడుకున్నారు. వీరి దోస్తాన్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై బీజేపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ కాంగ్రెస్ దీనిని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా ఉపయోగించుకుంది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేష్ ప్రతాప్ సింగ్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇలా ఒకరి చేయి పట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. ఆయన ఎప్పుడూ కోపంగా ఉంటారు. ఎవరితోనూ సంభాషించరని విమర్శించారు. కాగా.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా అనేక ఆసక్తికరమైన చిత్రాలు కనిపించాయి. ఒక వైపు, గిరిరాజ్ సింగ్, అఖిలేష్ యాదవ్ చాలా ప్రేమగా కలుసుకున్నారు. మరోవైపు, కిరణ్ రిజిజు కూడా అనేక మంది ప్రతిపక్ష నాయకులను కలుస్తూ కనిపించారు.