Site icon NTV Telugu

V. Hanumantha Rao: రాహుల్ గాంధీ ఆపరేషన్‌ సిందూర్‌ని వ్యతిరేకించలేదు..

V.hanumantha Rao

V.hanumantha Rao

పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు. భారత దేశానికి చెందిన ఏ విషయంలో అయినా క్రెడిట్ మన దేశానికే రావాలని.. అమెరికా కి కాదన్నారు. తమకు భారత రక్షణ దళాల మీద అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేశారు.

READ MORE: Virat Kohli: ఈ విజయం ఆర్సీబి అభిమానులకు అంకితం.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!

రాహుల్ గాంధీ కేవలం మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగి యుద్ధాన్ని ఆపేశారు అని అన్నట్లు హనుమంతరావు వెల్లడించారు. ఆయన ఎక్కడ కూడా ఆపరేషన్ సిందూర్ ని వ్యతిరేకించలేదని తెలిపారు. ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినపుడు ఏం చేయలేకపోయారన్నారు. ఇపుడు మీ తప్పుకి రాహుల్ గాంధీని ఏజెంట్ అనడం మీ వైఫల్యమని మండిపడ్డారు. అసలు ఈ దేశనికి స్వాతంత్ర్యం తెచ్చిందే గాంధీ ఫ్యామిలీ… ఆ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు. రాహుల్ గాంధీని అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

READ MORE: Kerala: ఉప్మా వద్దు బిర్యానీ కావాలన్న బుడ్డోడు.. కేరళ సర్కార్ ఏం చేసిందంటే..!

Exit mobile version