పెహాల్గాంలో 27 మంది భారతీయులను చంపిన దుర్మార్గం చర్యపై ప్రతి భారతీయుడు చాలా సీరియస్ గా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రధాని మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. ఆ తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సిందూర్ చేయడం జరిగిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ మోడీని లొంగిపో అన్నారని.. అమెరికా ఒత్తిడి కి లొంగి ఆపరేషన్ సింధూర్ ఆపేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఇంట్లో కాపు నేతల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కూడా హాజరైనట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలను పిలవడమేంటని మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ అంశంపై తాజాగా వీహెచ్ స్పందించారు. "ఒకరిద్దరికి కోపం రావచ్చు. నిన్న మీటింగ్ లో సీఎం నీ.. ప్రభుత్వాన్ని ఎవరు తిట్టలేదు. జనాభా లెక్క కొంచెం తక్కువ ఉందని అన్నారు. దాని మీద…
AICC: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదనతో కుల గణన చేసినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, కొంతమంది నేతలు కుల గణన…