Victory Venkatesh Saindhav Movie: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన 75వ చిత్రంతో అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా మరో పాన్ ఇండియా చిత్రం ‘సైంధవ్’ షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. హిట్ యూనివర్స్ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 5 భారతీయ భాషల్లో విడుదల కానుంది.
ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. చిత్రబృందంతో పాటు అక్కినేని నాగ చైతన్య, రానా దగ్గుబాటి, రాఘవేంద్రరావు, దిల్ రాజు, నాని, అనిల్ రావిపూడి, సురేష్ బాబు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషించేందుకు ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీని ఎంపిక చేశారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
బుధారం ఈ చిత్రానికి సంబంధించిన చిత్ర టైటిల్ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి ఇదొక వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇందులో వెంకటేష్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు. ఆయన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రమిది. దీన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు.
Victory @VenkyMama’s #SAINDHAV Kicks off on a
MASSIVE NOTE with the Grand Pooja Ceremony❤️Regular Shoot Commences Soon 🎬
A @KolanuSailesh Film 🔥@Nawazuddin_S @vboyanapalli @Music_Santhosh @maniDop @Garrybh88 @tkishore555 @SVR4446 @NiharikaEnt #Venky75 pic.twitter.com/WEOnv7vNno
— Niharika Entertainment (@NiharikaEnt) January 26, 2023