NTV Telugu Site icon

Venkaiah Naidu: ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులు

Venkaih Naidu

Venkaih Naidu

ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్ళు, ప్రభావం పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ న్యాయమూర్తి బి.శివశంకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతు.. రాజకీయాలు విరమించి ప్రజాజీవనంలో మాత్రమే పాల్గొంటున్నా.. రాజ్యాంగంలో ఉన్నత పదవి నుంచి వచ్చాక రాజకీయాలు మాట్లాడకూడదు.. పదవీ విరమణ చేసాను కానీ పెదవి విరమణ చేయలేదు.. రాజకీయంగా కనిపించని రాజకీయ అంశాలు మాట్లాడతాను.. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అర్ధవంతమైన చర్చ జరగాలి.. వ్యతిరేకించే వారు వ్యతిరేకించినా.. ప్రజలు అంటే‌ దేశం ఒక నిర్ణయానికి రావాలి.. పార్లమెంటు ఉభయసభలకు, అసెంబ్లీల సభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలి.

Also Read:Food Colors: ఏ రంగు ఆహారం తింటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!

1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.. ఆ తరువాత 1967 వరకూ ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి.. అప్పుడు ఎన్నికలు నిర్వహించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు కాదంటున్నారో వారే చెప్పాలి.. ఈ ఏకకాలం ఎన్నికలు కొత్త ఏమీ కాదు.. ఈ ఎన్నికలు ఒకేసారి జరిగితే కేంద్రానికి లాభం ఉంటుంది అనే దానిలో పస ఎంతుందో వాళ్ళే చెప్పాలి.. స్ధానిక పరిపాలన, జాతీయ పరిపాలన ఎవరు చేయగలరో అందరూ గమనిస్తున్నారు.. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీలకు ఉపయోగం లేదనే‌ వాదనలో పస లేదు.. ఒకేసారి ఎన్నికలు జరిగినపుడు అత్యధిక ఓటు శాతం నమోదైంది.. ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో ఎన్నికల సమయాలలో మార్పులొచ్చాయి.

Also Read:US: అమెరికాలో చదువుతున్న వారికి షాక్.. దేశం వదిలి వెళ్లాలంటూ ఈమెయిల్స్.. కారణం ఏమిటి..?

982 లో ఎన్టీఅర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. రామారావు లాంటి గట్టి నాయకుడు ఉండటంతో 1982లో టిడిపి గెలిచింది.. ఒక రాష్ట్రం అడ్డు అదుపు లేకుండా అప్పు తెస్తే తరువాత ప్రభుత్వాలు ఏమైపోవాలి.. అధికారంలోకి రాకముందు, వాగ్దానాల సమయంలో తెలీదు.. అధికారంలోకి వచ్చాక మొదటి తారీఖు జీతాలు ఇవ్వడానికి కుదరదు.. ప్రాజెక్టులు కట్టడానికి డబ్బులు ఉండాలి.. చదువు, వైద్యం మాత్రమే ఉచితం కావాలి.. అనవసరపు ఉచితాలు ఇస్తూ పోతే విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వలేం చేపను పట్టుకోవడ నేర్పించు.. తెచ్చి నోట్లో పెట్టొద్దు అని వెంకయ్యనాయుడు సూచించారు.

Also Read:BCCI: సీనియర్ ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టుపై ఫోకస్.. సమావేశం వాయిదా

మాజీ న్యాయమూర్తి శివశంకరరావు మాట్లాడుతూ.. ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తే పెద్ద ఇబ్బంది లేదు.. పదే పదే మధ్యలో ఎన్నికలు వస్తే.. ఎన్నికల కోడ్ ద్వారా చాలా పనులు ఆగిపోతాయి.. చాలామంది సెక్యులర్ భావాలంటూ సమాంతర ఎన్నికలు వద్దంటారు.. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరగడం సహజమే.. సమాంతర ఎన్నికల వలన ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు.. అడపా దడపా ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ పేరిట ఇబ్బందులు వస్తాయి.. సమాంతర ఎన్నికలను అందరూ స్వాగతించాలని అన్నారు.