Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి..