NTV Telugu Site icon

Vellampalli Srinivas Rao : ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం

Vellampally Srinivas Rao

Vellampally Srinivas Rao

Vellampalli Srinivas Rao : ప్రతిపక్షంలో ఉండగా కరెంట్ చార్జీలు పెంచమని ప్రతీ వీధికి వెళ్లి తిరిగి మరీ చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై పెనుభారం మోపారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ఈనెల 27వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కలసి నిరసన ర్యాలీలు చేపడుతున్నామన్నారు.. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కూడా గడవక ముందే 15,485 కోట్ల భారం మోపారన్నారు. విద్యుత్ చార్జీల మోసంపై ప్రజలతో కలసి చంద్రబాబును ఎండగడతామన్నారు.. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన విధంగా విద్యుత్ చార్జీల భారం మోపకూడదన్నారు.. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు.

Udalu Benefits: ఊబకాయంతో బాధ పడుతున్నారా? ఊదలు ట్రై చేయండి..

అధికారం లోకి రాగానే చంద్రబాబు బాధుడు బాబుగా మారిపోయారని మాజీమంత్రి మేరుగు నాగార్జున ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే కరెంట్ చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారన్నారు.. ఆరోజుల్లోనే ప్రజలు ఆందోళనలు చేసి కరెంట్ చార్జీలు పెంచ వద్దంటే గుర్రాలతో తొక్కించారన్నారు.. విద్యుత్ చార్జీలపై 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలసి పోరాటాలు చేస్తామన్నారు.. వైసీపీ హయంలో ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల లోపు ఉచితముగా కరెంట్ ఇచ్చామన్నారు. చంద్రబాబు మోసాలు ఇకనైనా అందరూ గమనించాలని మాజీమంత్రి నాగార్జున కోరారు.

ఆరునెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందని మాజీమంత్రి జోగిరమేష్ ఆరోపించారు. విద్యుత్ చార్జీలను పెంచి సీఎం చంద్రబాబు ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. చార్జీల భారంపై ప్రజలకు అండగా నిలిచేందుకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.. ప్రభుత్వం ప్రజలపై 15,485 కోట్ల భారం మోపిందన్నారు. ఇప్పటికే రైతులకు అండగా ఉండి పోరాటాలు చేశామన్నారు.. ఆరునెలల్లో సూపర్ సిక్స్ ఇస్తాడనుకుంటే ఎటు పోయిందో తెలియదన్నారు.. వైసీపీ 5 కోట్ల మంది ప్రజల పక్షాన పోరాటాలకు సిద్ధం ఉందన్నారు.. ఆరునెలల కాలంలో జగనన్న ఉంటే ఎంత మేలుజరిగేదో అంటూ ప్రజలు బాధ పడుతున్నారన్నారు.. దివంగత నేత వైఎస్ఆర్ ఆనాడు పెంచిన కరెంటు చార్జీల మీద పోరాటం చేస్తే.. చంద్రబాబు కాల్పుల్లో పలువురు మరణించిన విషయం అందరికి గుర్తుందన్నారు..

Smartphones Launch 2025: వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే!