Udalu Benefits: ఊబకాయంతో బాధ పడుతున్నారా? ఊదలు ట్రై చేయండి..
- భారతదేశంలో చిరు ధాన్యాలలో ఊదలు కూడా ఒకటి..
- ఊదలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం..
- ఊబకాయం రాకుండా ఉండాలంటే ఊదలు తినడం మంచింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Udalu Benefits: భారతదేశంలో చిరు ధాన్యాలను తరచుగా ఉపయోగిస్తారు. చిరుధాన్యాలలో అనేక పోషకాలు నిండి ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఊదలు కూడా ఒకటి. పురాతన కాలం నుండి ఊదలు ఆహారంగా, ఔషధంగా ఉపయోగించబడుతున్నాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అన్నం, కిచిడీ, దోసె, ఇడ్లీ ఇలా రకరకాలుగా ఊదలతో చేసుకుని తినవచ్చు.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఊదలు తినడం చాలా మంచిది. వాటిని నేరుగా తినకుండా పాలు, స్మూతీస్ లేదా స్వీట్లతో కలుపుకోవచ్చు.
Also Read
- Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
- Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
- Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
గుండె జబ్బులు ఉన్నవారు వీటిని పరిమిత పరిమాణంలో తినాలి. ఊదలలో క్యాలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది మరియు బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఊదలులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ ఊదలు తినడం మంచిది. ఊదలు గ్లూటెన్ రహిత ఆహారం. అందువల్ల, గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారు కూడా వాటిని తినవచ్చు. ఊదలలోని విటమిన్ సి, విటమిన్ డి చర్మాన్ని ఆరోగ్యంగా, పోషణతో ఉంచడంలో సహాయపడతాయి.
Read also: Lokesh Kanagaraj : ఈ సారైనా హిట్టు దక్కేనా..?
ఇది చర్మాన్ని ముడతలు పడకుండా చేసి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఊదలు తినడం వల్ల మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయ రాళ్లను తొలగించడానికే కాకుండా.. కొన్ని రకాల జ్వరాలకు చికిత్స చేయడానికి కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఊదలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Read also: U19 Asia Cup 2024: మెరిసిన తెలంగాణ అమ్మాయి.. ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్!
గర్భిణీ స్త్రీలు పాలకూర తింటే చాలా మేలు జరుగుతుంది. అవి పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి అవసరమైన ఇనుమును అందిస్తాయి. ప్రసవ సమయంలో ఉపశమనాన్ని అందించడానికి ఊదలు సహాయపడుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఊదలు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు గుండె సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఊదలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందువలన, అవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి.
Save Bangladeshi Hindus: హిందూయేతర బంగ్లాదేశీయులకు వైద్యం అందించవద్దు..
తాజావార్తలు
-
Poonam Kaur : ముందుంది అసలు సినిమా.. పవన్ విడాకుల వేళ పూనమ్ కౌర్ ట్వీట్ కలకలం!
-
Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
-
Jaggareddy: సోనియాగాంధీ ఆత్మకథతో తెలుగులో సినిమా తీస్తా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
-
Rashmika: రష్మిక క్రేజ్‌కు వరుస బ్రేకులు.. ‘మైసా’తో బౌన్స్ బ్యాక్ అవుతుందా?
-
Gandhi Family: ఇందిరా గాంధీ – మేనక మధ్య విభేదాలకు అసలు కారణాలివే.. సోనియా ఆత్మకథలో కీలక విషయాలు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!