AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్వాసితుల కోసం మూడో విడత కింద రూ.250 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. 30 ఏళ్ల క్రితం అసాధ్యమనుకున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేసి చూపించామని సీఎం పేర్కొన్నారు. 1996లో తానే స్వయంగా ఈ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశానని, 2026లో దీనిని ప్రారంభించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 1995లో ముఖ్యమంత్రిగా ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు స్థానిక రైతులు సాగు, తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రజల దాహార్తిని, సాగునీటి అవసరాలను తీర్చాలనే సంకల్పంతోనే గడచిన రెండేళ్ల కాలంలో ప్రాజెక్టు పనుల కోసం రూ.2,250 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు.
గతంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ వేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేసే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల రాజ్యంలో 50 శాతం లోటు వర్షపాతం నమోదైందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీరు చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీరందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నామని చెప్పారు.
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
- Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
2019లోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే 2021 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని, గత పాలకుల అలసత్వం, డ్రామాల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి ప్రకాశం, నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతాలకు మళ్లించవచ్చని వివరించారు.
దేశంలో నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి గంగా, గోదావరి, కావేరి నదులను అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రధానమైన ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి తీరిపోతుందని, దేశానికే నీటి భద్రత చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాలా మేలు చేస్తామని, మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే సెప్టెంబరులో హార్టికల్చర్ హబ్‌కు ఫౌండేషన్ వేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే, అభివృద్ధి మరియు ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం వివరించారు.
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్‌పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?