Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. అక్రమాలను అరికట్టి నిజమైన లబ్ధిదారులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా విధించిన నిబంధనలు క్షేత్రస్థాయిలో రైతులకు తీవ్ర అయోమయాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఈ బోనస్ సొమ్ము అందాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశించిన 7 రకాల సన్న వరి విత్తనాలను మాత్రమే సాగు చేసి ఉండాలి. అందులో ఆర్ఎస్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం 1638 (కూనారం వరి-2), జైశ్రీరామ్, కేఎన్ఎం 7715, బీపీటీ 5204 (సాంబమసూరు), హెచ్ఎంటీ సోనా, డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి) రకాలు ఉన్నాయి. రైతులు తాము విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, కొనుగోలు బిల్లు సమర్పించి సెప్టెంబర్ 10వ తేదీలోగా తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
నెల రోజుల కిందటే విత్తనాలు కొనుగోలు చేసినందున ఇప్పుడు పాత బిల్లులు దొరకక, దుకాణాల చుట్టూ తిరగలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలాచోట్ల వ్యాపారుల వద్ద రికార్డులు లేకపోవడంతో వాగ్వాదాలు జరుగుతున్నాయి. మరోవైపు మార్కెట్లో లభించే ఇతర రకాల సన్న వరిని సాగు చేసిన రైతులు తమకు బోనస్ వర్తించకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకుని సాగు చేసిన రైతులు కూడా ఏ దుకాణంలో నమోదు చేసుకోవాలో తెలియక గందరగోళానికి గురయ్యారు. ఈ సమస్యపై స్పందించిన జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. సొంత విత్తనాలు వాడిన రైతులు దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, స్థానిక వ్యవసాయ అధికారులకు సొంత డిక్లరేషన్ (Self-Declaration) రాసి ఇస్తే సరిపోతుందని తెలిపారు. సెప్టెంబర్ 10 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోనే దాదాపు 2.51 లక్షల ఎకరాల్లో సన్న రకాలు సాగవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను మరింత సులభతరం చేయాలని రైతాంగం కోరుతోంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!