రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై రోజురోజుకు హైప్ పెరుగుతూనే ఉంది. సినిమా రామాయణం ఆధారంగా ఉండబోతుందని రాజమౌళి చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు శ్రీరాముడి తరహా పాత్రలో కనిపించనున్నారన్న వార్తలతో ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పటి వరకు సస్పెన్స్‌గా ఉన్న విషయం ఏమిటంటే.. హనుమంతుడి ప్రేరణతో ఉన్న పవర్‌ఫుల్ రోల్‌ను ఎవరు చేస్తారు? అని.. ఇక తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రను,
స్టార్ సీనియర్ హీరో ఆర్. మాధవన్ పోషిస్తున్నారట. ఇదే విషయంపై ఫిల్మ్ నాగర్‌లో హాట్ టాక్ నడుస్తోంది. హనుమంతుని శక్తి, భక్తి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ప్రత్యేకమైన పాత్ర ఇది. మాధవన్‌తో ఇప్పటికే కొన్ని సీన్లను కూడా షూట్ చేశారన్న ప్రచారం ఉంది. అయితే మాధవన్ నిజంగా హనుమంతుడి పాత్రలో కనిపిస్తారా..? ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు సూటయ్యేలా ఉంటాయా..? అన్న విషయంలో మాత్రం అభిమానుల మధ్య మిశ్రమ స్పందన కనిపిస్తున్నాయి. కానీ రాజమౌళి సెలెక్షన్ పై నమ్మకంతో చాలామంది ‘మాధవన్ తప్పకుండా సర్ప్రైజ్ చేస్తాడు’ అని భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు తండ్రి పాత్రకు మొదట నానా పటేకర్‌ను అనుకున్నప్పటికీ, ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఆ పాత్ర కోసం జక్కన్న మరో సీనియర్ నటుడిని ఫైనలైజ్ చేస్తున్నారట. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మరో అంతర్జాతీయ నటి కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉంది. మొత్తం మీద, ‘వారణాసి’లో హనుమంతుడి పాత్ర చుట్టూ ఉన్న సస్పెన్స్ తో సినిమా మీద క్రేజ్ ఇంకా డబుల్ అవుతుంది. మరి ఈ కాంబో ఏమి మేజిక్ చేస్తుందో చూడాలి!