Varanasi : 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో మహేష్ బాబు విశ్వరూపం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపిస్తుండగా, ఆయనకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో హైలైట్ న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటంటే మహేష్ బాబు 3000 ఏళ్ల చరిత్ర కలిగిన భారతీయ పురాతన యుద్ధ కళ ‘కలరిపయట్టు’లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన నిపుణుడు హరికృష్ణన్ దగ్గర మహేష్ ఈ విద్యను నేర్చుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో విలన్ ‘కుంభ’గా నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే ఈ విద్యలో శిక్షణ తిసుకున్నరట.. దీంతో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది.
Also Read : Shambhala OTT: శంబాల ఓటీటీ డీల్ డీటైల్స్ వైరల్..
Also Read
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలవనుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను మరో ఎనిమిది నెలల్లో పూర్తి చేసి, ఆ తర్వాత సుదీర్ఘంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్‌ను 2027 సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఒకపక్క హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, మరోపక్క పురాతన యుద్ధ కళల మేళవింపుతో రాబోతున్న ‘వారణాసి’ బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి